Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖర్గేకు కౌంటర్ ఇచ్చిన శశిథరూర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోరులో ప్రచార పర్వం ప్రారంభమైంది. బరిలో నిలిచిన ఇరువురు నేతలు శశిథరూర్, మల్లిఖార్జున్ ఖర్గేలు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖర్గే వ్యాఖ్యలపై శశిథరూర్ స్పందించారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్లో మార్పుల కోసమని, కానీ ఖర్గే నాయకత్వంలో పార్టీలో యథాతథ స్థితిని, పాతపద్ధతులే కొనసాగు తాయని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక అనేది పార్టీలో అంతర్గతంగా జరిగే పోటీ కాదన్నారు. అయితే బీజేపీపై ఎంతసమర్థవంతంగా పోటీ ఉండాలనే దానిని నిర్ణయించేందుకు ఈ ఎన్నిక ఓ అవకాశమన్నారు. ఖర్గేకు, తనకు మధ్య ఎలాంటి సైద్ధాంతిక విభేదాలు లేవని వెల్లడించారు. ఈ పోటీ పార్టీని ఎలా సమర్థవంతంగా నడుపుతారన్న అంశంపై మాత్రమేనని అన్నారు. 'థింక్ టుమారో.. థిక్ థరూర్' అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఏకాభిప్రాయంతో పూర్తి కావాలని తాను ప్రయత్నించినా, థరూర్ మాత్రం పోటీనే కోరుకున్నారని ఖర్గే ఆదివారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోటీ అవసరమని థరూర్ నిశ్చితాభిప్రాయంతో ఉన్నారని అన్నారు. పార్టీ అధ్యక్షునిగా తాను ఎన్నికైతే గాంధీ కుటుంబంతో, ఇతర సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపి, వారు చెప్పిన మంచి విషయాలు ఆచరిస్తానని పేర్కొన్నారు. అలాగని తాను గాంధీ కుటుంబ మద్దతు ఉన్న అధికారిక అభ్యర్థిని కాదని అన్నారు. బీజేపీపై పోరాడేందుకు నేతలంతా ఒక్కటై తనకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు.