Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'క్యారక్టర్ సర్టిఫికెట్' తీసుకురావాలన్న నోటిఫికేషన్ ఉపసంహరించుకున్న యంత్రాంగం
- ఇది అప్రకటిత ఎమర్జన్సీ అంటూ ఖండించిన జర్నలిస్టుల సంఘాలు
న్యూఢిల్లీ : దసరా ఉత్సవాలకై ప్రధాని నరేంద్ర మోడీ హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తును నేపథ్యంలో ఆ వార్తలను కవర్ చేసే జర్నలిస్టులు పాస్‌లు కావాలంటే ముందుగా 'క్యారక్టర్ సర్టిఫికెట్' తీసుకురావాలంటూ గతవారం జారీ చేసిన వివాదాస్పద నోటిఫికేషన్‌ను అధికారులు ప్రస్తుతం ఉపసంహరించుకున్నారు. బిలాస్పూర్ జిల్లా పాలనా యంత్రాంగం గతవారంలో ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. గత నెల 24న రాష్ట్రంలోని మండి నగరంలో ప్రధాని పర్యటించాల్సి వుంది. కానీ వాతావరణం బాగుండన్న కారణంగా ఆ పర్యటన రద్దైంది. దాంతో ప్రధాని చివరి ర్యాలీ ముగిసిన తర్వాత బుధవారం (5వతేదీ) బిలాస్పూర్ జిల్లాలోని లుహ్ను గ్రౌండ్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించనున్నారు. కేవలం ప్రయివేటు వార్తా సంస్థలకే కాకుండా ఆకాశవాణి వంటి ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులకు కూడా పై ఆదేశాలు వర్తిస్తాయని అధికారులు ప్రకటించారు. అక్టోబరు 1వ తేదికల్లా జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల బందంతో కూడిన జాబితా వివరాలను, ఆలాగే ఆకాశవాణి, దూరదర్శన్ల బందాల జాబితాలను వారి కేరక్టర్ వెరిఫికేషన్ సర్టిఫికెట్తో సహా బిలాస్పూర్ నేర దర్యాప్తు విభాగానికి (సీఐడీ) చెందిన డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌కి పంపాల్సిందిగా కోరుతూ పోలీసులు సెప్టెంబరు 29న ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ఎవరు ఆ కార్యక్రమానికి హాజరు కావాలో ఆ కార్యాలయం నిర్ణయిస్తుందని నోటిఫికేషన్ తెలిపింది. నవంబరులో ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఆ నోటిఫికేషన్ తీవ్ర వివాదాన్ని సృష్టించింది. మంచి, చెడు జర్నలిస్టులంటూ లక్ష్మణ రేఖ గీయడానికి కాషాయపార్టీ ప్రయత్నిస్తోందంటూ జరులిస్టులు మండిపడ్డారు. అన్ని పార్టీలు కూడా తీవ్రంగానే స్పందించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం హిమాచల్ డిజిపి సంజరు కుందూ దీనిపై వివరణ ఇస్తూ ట్వీట్ చేశారు. ప్రధానికార్యక్రమానికి జరులిస్టులందరూ ఆహ్వానితులేనిఅన్నారు. వారి కవరేజ్‌కి అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర పోలీసులు చేస్తారనిచెప్పారు. సెప్టెంబరు 29నాటి నోటిఫికేషన్ అనుకోకుండా జారీ చేయబడిందని, దాన్ని ఉపసంహరించుకున్నామని తెలియచేస్తూ బిలాస్ఫూర్ ఎస్పీ మంగళవారం డీపీఆర్ఓకు లేఖ రాశారు.
డీయూజే ఖండన
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలను ఢిల్లీ జరులిస్టుల యూనియన్ (డియుజె) తీవ్రంగా ఖండించింది. దురుద్దేశ్యంతో జారీ చేసిన ఆదేశాలను చివరి నిముషంలోనైనా ఉపసంహరించుకోవడాన్ని స్వాగతిస్తూ, యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.కె.పాండే, సుజాతా మదోక్లు ఒక ప్రకటన జారీ చేశారు. పత్రికల గొంతు నొక్కేందుకు పాలకులు చేస్తును అధికార దుర్వినియోగమని విమర్శించారు. ఇదొక అరిష్ట సంకేతమని వ్యాఖ్యానించారు. జర్నలిస్టులపై ఇటువంటి నిఘా పెట్టడం వల్ల తమ విధి నిర్వహణ మరింత కష్టమవుతుందని అన్నారు. జర్నలిస్టులను తీవ్రంగా అనుమానించడం, ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల పేషీలు, పార్లమెంట్‌కు కూడా జర్నలిస్టులు వెళ్ళేందుకు గల అవకాశాలను అణచివేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేయడం ఇదంతా ఈ ప్రభుత్వ హాల్‌మార్క్‌గా మారుతోందని పేర్కొంది. కేవలం ఎంపిక చేసిన కొద్దిమంది జర్నలిస్టులను మాత్రమే అవకాశం కల్పించి, ప్రభుత్వం, పాలన పట్ల పారదర్శకత లేకుండా చేయడానికి యత్నిస్తున్నారనిఆ సంయుక్త ప్రకటన విమర్శించంది. రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య స్ఫూర్తినిదెబ్బతీయడమేనని, అప్రకటిత ఎమర్జన్సీని పోలివుండే ప్రమాదకరమైన పరిస్థితులేనివారు ఆ ప్రకటనలో విమర్శించారు.