Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను రాజ్యసభ సచివాలయం అధికారకంగా మంగళవారం ప్రకటిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర రహదారులు, పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వశాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఈ కమిటీలో వైసిపి లోక్సభ ఎంపి మార్గాని భరత్, రాజ్యసభ ఎంపి సిఎం రమేష్, సిపిఎం రాజ్యసభ సభ్యులు ఎఎ రహీంతోపాటు వివిధ పార్టీలకు చెందిన 10 మంది రాజ్యసభ, 21 మంది లోకసభ ఎంపిలు మొత్తం 31 మంది సభ్యులుగా ఉన్నారు.
వివేక్ ఠాకూర్ ఛైర్మన్గా విద్య, మహిళ, శిశు, యువజన, క్రీడల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఎంపి భువనేశ్వర్ కలిటా ఛైర్మన్గా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఎంపి బ్రిజ్లాల్ ఛైర్మన్గా హోం వ్యవహారాల, ఎంపి తిరుచ్చి శివ ఛైర్మన్గా వాణిజ్య, ఎంపి సుశీల్ కుమార్ మోడీ ఛైర్మన్గా న్యాయ, పర్సనల్, ప్రజా ఫిర్యాదులు, ఎంపి జైరాం రమేష్ ఛైర్మన్గా శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, పర్వతగౌడ చందనగౌడ గడ్డిగౌడర్ ఛైర్మన్గా వ్యవసాయ, పశుసంవర్ధక, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంపి రాకేష్ సింఘ్ ఛైర్మన్గా బొగ్గు, గనులు, ఉక్కు, ఎంపి ప్రతాపరావు జాదవ్ ఛైర్మన్గా కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంపి జువల్ ఓరం ఛైర్మన్గా రక్షణ, జగదాంబిక పాల్ ఛైర్మన్గా ఎనర్జీ, ఎంపి పిపి చౌదరి ఛైర్మన్గా విదేశీ వ్యవహారాల, ఎంపి జయంతి సిన్హా ఛైర్మన్గా ఆర్థిక, రాజీవ్ రంజన్ సింగ్ ఛైర్మన్గా హౌసింగ్, పట్టణ వ్యవహారాల, ఎంపి భర్తృహరి మెహతాబ్ ఛైర్మన్గా కార్మిక, టెక్స్టైల్స్, స్కిల్ డవలప్మెంటు, రమేష్ బిథూరీ ఛైర్మన్గా పెట్రోలియం, సహజ గ్యాస్, ఎంపి రాధామోహన్ సింగ్ ఛైర్మన్గా రైల్వే, ఎంపి కనిమొళి ఛైర్మన్గా గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్, ఎంపి రమాదేవి ఛైర్మన్గా సామాజిక న్యాయం, సాధికారత, సవభాయి పటేల్ ఛైర్మన్గా నీటి వనరులు, ఎంపి లాకెట్ ఛటర్జీ ఛైర్మన్గా వినియోగదారుని వ్యవహారాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను నియమించారు.