Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢల్లీ : ఈ ఏడాది భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం వరించింది. ఫోటాన్లలో చిక్కుముడులు, బెల్ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో చేసిన ప్రయోగాలకుగాను అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్.క్లాజర్, ఆంటోన్ జైలింగర్‌లకు ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారం లభించింది. ఈ ముగ్గురు క్వాంటం స్థితులను ఉపయోగించి సంచలనాత్మక ప్రయో గాలు నిర్విహించారు. రెండు కణాలు విడిపోయినప్పుడు కూడా ఒకే యూనిట్‌గా ప్రవర్తిస్తాయని నిరూపిం చారు. ఈ పరిశోధన ఫలితాలు క్వాంటం సమాచారం ఆధారంగా సరికొత్త సాంకేతికతకు నూతన మార్గాలు వేశాయి. నోబెల్ పురస్కార గ్రహీతలకు గోల్డ్ మెడల్, కోటి స్వీడిష్ క్రోనార్ (దాదాపు రూ.93లక్షలు) అందజేస్తారు. 1896లో మరణించిన స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజనీర్ ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తున్నారు. బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం నోబెల్ శాంతి, 10న ఆర్థికశాస్త్రంలలో పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10 అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. భౌతిక శాస్త్రంలో గతేడాది కూడా ముగ్గురు శాస్త్రవేత్తలు నోబెల్ బహుమతి దక్కడం గమనార్హం. సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై విశ్లేషణలకుగాను సుకురో మనాబే, క్లాస్ హలిస్‌మన్, జార్జియో పారిసీలకు సంయుక్తంగా నోబెల్ పురస్కారం లభించింది. కాగా జార్జియో పారసీకి సగం పురస్కారాన్ని అందించగా మిగతా సగాన్ని మనాబే, హలిస్‌మన్‌లు పంచుకున్నారు. నోబెల్ బహుమతి ప్రకటనలు సోమవారం నుంచి ప్రారంభం కాగా, తొలి రోజు వైద్యశాస్త్రంలో నోబెల్ ప్రకటించారు.