Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ అధ్యయనం
న్యూఢిల్లీ : భారత్లో 65 ఏండ్లలో (1953 నుంచి 2018 వరకు) వరదలు, భారీ వర్షాల కారణంగా రూ. 4 లక్షల కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లింది. కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ అధ్యయనంలో ఇది తేలింది. దీనిని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ఐడీఎం) నిర్వహించింది. కాగా, సంభవించిన నష్టంలో సగానికి పైగా గత 10 ఏండ్లలోనే జరగటం గమనార్హం. 2013లో ఉత్తరాఖండ్ క్లౌడ్బర్స్ట్ (కేదార్నాథ్ వరదలు), 2015లో దక్షిణ భారత్లో శీతాకాలపు వర్షాలు అధిక నష్టాన్ని కలిగించాయి. ఈ రెండేండ్లలో ఆర్థిక నష్టాలు వరుసగా రూ. 47వేల కోట్లు, రూ. 57వేల కోట్లుగా నివేదిక అంచనా వేసింది. వరద నిర్వహణలో సమగ్ర విధానం కోసం హౌం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సమీకృత రిజర్వాయర్లు, ఆనకట్టలు, రివర్ బేసిన్ మేనేజ్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర జల మంత్రిత్వ శాఖతో సంప్రదింపుల తర్వాత ఎన్ఐడీఎం ప్రతిపాదించింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, జిల్లా పరిపాలనలు, శాస్త్రీయ సంస్థలు, ఎన్జీఓలు సభ్యులుగా ఉండొచ్చు.