Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరకాశీ జిల్లాలోని మౌంట్ ద్రౌపది కా దండా 2 పీక్ వద్ద సంభవించిన ఆకస్మిక హిమపాతంలో చిక్కుకున్న పర్వతారోహకుల బృందంలో 10 మంది మరణించారు. నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ (ఎన్ఐఎం)కు చెందిన 34 మంది ట్రైనీ పర్వతారోహకులు, ఏడుగురు ఇనస్ట్రక్టర్స్తో ఒక బృందం పర్వతారోహణ నుంచి తిరిగివస్తూ హిమపాతంలో చిక్కుకుపోయింది. వీరిలో 10 మంది మృతదేహాలను గుర్తించినట్టు ఎన్ఐఎం ప్రిన్స్‌పల్ కల్నల్ అమిత్ బిష్త్ మంగళవారం తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాలింపు చర్యల్లో భారత సైన్యం సహాయం కూడా తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చెప్పారు.