Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్ మంజారు చేసింది. ఈ బెయిల్‌పై ఈ నెల 12 వరకూ స్టే విధించింది. ఈడీ అరెస్టు చేయడంపై అనిల్ దేశ్‌ముఖ్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ధర్మాసనం సెప్టెంబరు 28న విచారణ పూర్తి చేసింది. తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. మంగళవారం రూ.లక్ష షూరిటీపై బెయిల్ మంజారు చేసింది. దీనికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు వెళతామని హైకోర్టుకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం సుప్రీం కోర్టుకు సెలవులు కారణంగా ఈ నెల 14 వరకూ బెయిల్‌పై స్టే విధించాలని కోరారు. దీనిని పరిశీలించిన హైకోర్టు సుప్రీం కోర్టు ఈ నెల 10న పున:ప్రారంభమవుతుందని, కాబట్టి 12 వరకూ స్టే విధిస్తామని తెలిపింది. ఈ నెల 13 నుంచి బెయిల్ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. సుప్రీం కోర్టు ఈ బెయిల్‌పై ఎలాంటి తీర్పు ఇచ్చినా ఈ నెల 14న అనిల్ దేశ్‌ముఖ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే అనిల్‌పై సిబిఐ కేసు కూడా ఉంది. ప్రస్తుతం అనిల్ దేశ్‌ముఖ్ ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు.