Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూళ్లూరుపేట : తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో అంతరిక్ష వారోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్.రవి షార్‌లోని ఎంఆర్ కురుఫ్ ఆడిటోరియంలో జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విక్రమ సారాబారు, సతీష్ ధావన్ లాంటి మహానుభావులు మనదేశానికి అంతరిక్ష ప్రయోగాల ఆవశ్యకతను గుర్తించారని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో అంతరిక్ష ప్రయోగాల ఆవశ్యకతపై ప్రభుత్వాన్ని ఒప్పించి ముందుకు నడిపించారని కొనియాడారు. అంతరిక్ష పరిశోధనలో భారతదేశం అగ్రరాజ్యాలతో సమానంగా పోటీపడుతోందని, భారతదేశం ప్రపంచ దేశాలతోపాటు అంతరిక్ష భద్రతకు పాటుపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో షార్ డైరెక్టర్ రాజరాజన్, కంట్రోలర్ శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్లు షార్ సిబ్బంది పాల్గొన్నారు.