Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొల్కతా : దసరా ఉత్సవాల సందర్భంగా పశ్చిమబెంగాల్లోని రాస్బెహరీ వద్ద ఏర్పాటు చేసిన మార్క్సిస్టు, ప్రోగ్రెసివ్ బుక్‌స్టాల్‌పై టిఎంసి గూండాలు దాడి చేశారు.దీంతో స్థానిక సిపిఎం నాయకు లు నిరసనకు దిగారు. బుక్‌స్టాల్‌ను పున:ప్రారంభించారు. ఈసారి మళ్లీ టిఎంసి గూండాలు, పోలీసులు కలిసి వారిపై దాడికి దిగారు. ఈ దాడిని స్థానికులు ప్రతిఘటించడంతో తొమ్మిది మంది సిపిఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లోల్ ముజుందర్, ప్రముఖ దర్శకులు కమలేశ్వర్ ముఖోపాధ్యాయ కూడా ఉన్నారు. ఈ సంగతి తెలిసి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్‌డి సలీమ్ అక్కడకు చేరుకోవడంతో పోలీసులు అరెస్టు చేసిన వారందరినీ విడిచిపెట్టారు.