Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధులను రెట్టింపు చేసిన కేరళ ప్రభుత్వం
తిరువనంతపురం: విజయవంతమైన స్టార్టప్‌ల కోసం కేరళ స్టేట్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పో రేషన్ (కేఎస్ఐడీసీ) అందించే 'స్కేల్ ఆఫ్ ఫండ్' రెట్టింపయ్యింది. రూ. 50 లక్షల నుంచి కోటికి పెంచి నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల పరిశ్ర మల శాఖా మంత్రి తిరువనంతపురంలో జరిగిన స్కేల్ ఆఫ్ కాన్ల్కేవ్లో ఈ ప్రకటన చేశారు. స్టార్టప్ రంగంలో అందించిన కృషికి గాను డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండిస్టీ అండ్ ట్రేడ్ (డీపీఐఐటీ) అందించే టాప్ ఫెర్మార్ అవార్డుకు వరుసగా మూడేండ్ల పాటు కేరళ ప్రభుత్వం ఎంపికైంది. దీంతో స్టార్టప్ రంగానికి మరింత సహకారం అందించాలని కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం నిర్ణయించింది. స్టార్టప్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి, విక్రయించ డానికి సప్లెకోలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేరళ స్టార్టప్ మిషన్ (కేఎస్‌యూఎం) కేరళ టెక్నాలజీ స్టార్టప్ పాలసీ అమలు చేసే ఏజన్సీగా వ్యవహరించడంతో పాటు రాష్ట్రంలో వ్యవస్థాపకతను ప్రోత్సహించే నోడల్ ఏజన్సీగా పనిచేస్తుంది. కేఎస్యూఎంని 2006లో ప్రారంభించగా, 2015లో నోడల్ ఏజన్సీ గా ఆరంభించింది. కొత్త రాష్ట్ర ఐటీ విధానం 2017 లో స్టార్టప్‌లకు ప్రాధాన్యతనివ్వడంపై ఎల్ డీఎఫ్ ప్రభుత్వం దృష్టి సారించింది. అప్పటి నుంచి స్టార్టప్ లను ప్రోత్సహించడం, నిధులు సమకూర్చడంలో వేగంగా పురోగతి సాధించింది. ఐటి స్టార్టప్‌లకు అం దించే పథకాలు, ఆర్థిక సహాయం ఐటియేతర స్టార్టప్ లకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించి నట్టు మంత్రి తెలిపారు. మేడ్ ఇన్ కేరళ, బ్రాండ్ ఇన్ కేరళతో సహా బ్రాండింగ్ పాలసీలు, మార్కెట్లో పెట్టుబడులు రూపొందించబడతాయని రాజీవ్ తెలి పారు. సులభతర వాణిజ్యంలో కేరళ రాష్ట్రం 28వ స్థానం నుంచి 15వ స్థానానికి ఎగబాకిందనీ, కానీ రాష్ట్రంపై చాలా ప్రతికూలతలు ప్రచారం అవుతున్నా యని అన్నారు. స్టార్టప్‌లలో ఉత్తమ పనితీరుతో బెస్ట్ ఫెర్ఫార్మర్ అవార్డును గెలుచుకోవడం మరో ఘనత అని రాజీవ్ పేర్కొన్నారు. కెల్ట్రాన్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్సెడ్ కంప్యూటింగ్, విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ అందించే వివరణాత్మక నివేదికలతో.. ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండెక్టర్ అసోసియేషన్‌తో కలిసి సెమీ కండెక్టర్ హబ్‌గా మారే అవకాశాలను కూడా రాష్ట్రం అన్వేషిస్తోందని అన్నారు.