Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్రవ్యోల్బణం 7.3 శాతానికి చేరొచ్చు : బార్క్లేస్ అంచనా..
న్యూఢిల్లీ : భారత్లో మరింత అధిక ధరలు నమోదు కావొచ్చని బార్క్లేస్ ఓ రిపోర్టులో అంచనా వేసింది. ఏడాదికేడాదితో పోల్చితే గడిచిన సెప్టెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ 7.3 శాతానికి చేరొచ్చని పేర్కొంది. ఇంతక్రితం ఆగస్టుతో పోల్చితే 30 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉండొచ్చని తెలిపింది. అదే జరిగితే ఆర్బీఐ ధరల కట్టడి లక్ష్యం కంటే వరుసగా తొమ్మిదో మాసంలోనూ అధిక ధరలు నమోదు కానున్నాయి. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి రెండు శాతం అటూ, ఇటుగా కట్టడి చేయాలని ఆర్బిఐ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. కాగా.. తొమ్మిది నెలల నుంచి ఇది ఆరు శాతం ఎగువన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోన్న అంశం. తణధాన్యాలు, పప్పులు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పాడి వంటి ప్రధాన ఉత్పత్తుల ధరల్లో పెరుగుదల వల్ల సెప్టెంబర్లోనూ హెచ్చు ద్రవ్యోల్బణం చోటుచేసుకోనుందని బార్క్లేస్ పేర్కొంది.