Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆరోపించిన నాలుగు దగ్గు మందులూ భారత్లో అందుబాటులో లేవని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డిస్టిబ్యూటర్స్ (ఏఐఓసీడీ) వెల్లడించింది. భారత్లోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయరు చేసిన దగ్గు మందులు వాడి గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందారని డబ్ల్యూహెచ్ఓ బుధవారం ఆరోపించింది. ప్రోమెథజిన్ ఓరల్ సొల్యూషన్, కొఫెక్షమలైన్ బేబీ కాఫ్ సిరఫ్, మేకాఫ్ బేబీ కాఫ్ సిరఫ్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరఫ్లపై డబ్ల్యూహెచ్ఒ ఆరోపణలు చేసింది. ఈ దగ్గు మందులు దేశంలో అందుబాటులో లేవని ఎఐఒసిడి తెలిపింది. ఒక వేళ ఈ మందులు భారత్ మార్కెట్లో ఉన్నట్లయితే, వాటి సరఫరాను తక్షణమే నిలిపివేస్తామని డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు హామీ ఇచ్చింది. 'మైడెన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఉనికి భారత్లో లేదు. ఈ కంపెనీ తన ఉత్పత్తులను కేవలం ఎగుమతి మాత్రమే చేస్తుంది' అని ఎఐఒసిడి తెలిపింది. అలాగే మరోవైపు డబ్ల్యూహెచ్ఒ హెచ్చరికలపై భారత ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.