Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ : చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) కింద కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ వివిధ సంస్థలకు చెందిన పది మంది సభ్యులను ఉగ్రవాదులుగా ప్రకటించింది. హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్ఎం), లష్కరే తోయిబా (ఎల్టీ)తో పాటు ఇతర నిషేధిత సంస్థలకు చెందిన మొత్తం 10 మంది సభ్యులను కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఉగ్రవాదులుగా పేర్కొనబడిన వారిలో పాకిస్థాన్ జాతీయుడైన హబీబుల్లా మాలిక్ అలియాస్ సాజిద్ జుట్, జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా (ప్రస్తుతం పాకిస్థాన్‌లో నివాసం)కు చెందిన బసిత్ అహ్మద్ రేషి, జమ్మూ కాశ్మీర్‌లోని సోపోర్ (ప్రస్తుతం పాకిస్తాన్లో నివాసం)కు చెందిన ఇమ్తియాజ్ అహ్మద్ కండూ అలియాస్ సజాద్, పూంచ్ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో నివాసం)కు చెందిన జాఫర్ ఇక్బాల్ అలియాస్ సలీం, పుల్వామాకు చెందిన షేక్ జమీల్-ఉర్-రెహ్మాన్ అలియాస్ షేక్ సాహబ్, శ్రీనగర్‌కు (ప్రస్తుతం పాకిస్తాన్లో నివాసం)చెందిన బిలాల్ అహ్మద్ బేగ్ అలియాస్ బాబర్, పూంచ్‌కు చెందిన రఫీక్ నారు అలియాస్ సుల్తాన్, దోడాకు చెందిన ఇర్షాద్ అహ్మద్ అలియాస్ ఇద్రీస్, కుప్వారాకు చెందిన బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ల్మతియాజ్, ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న బారాముల్లాకు చెందిన షోకత్ అహ్మద్ షేక్ అలియాస్ షోకత్ మోచి ఉన్నారు. కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఆయా వ్యక్తులు ఉగ్రచర్యలను పేర్కొంది.