Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేషనల్ హెరాల్డ్ కేసు
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలు గీతా రెడ్డి, గాలి అనిల్ కుమార్లను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారించింది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించింది. అందులో నేషనల్ హెరాల్డ్ కేసులో యంగ్ ఇండియా లిమిటెడ్ ఖాతాలకు వచ్చిన విరాళాలపై గత నెలలో తెలంగాణ నేతలు సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, గీతా రెడ్డి, అనిల్ కుమార్లకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇందులో సోమవారం షబ్బీర్ అలీ విచారణ ముగిసింది. గురువారం గీతా రెడ్డి, అనిల్ కుమార్లను ఈడీ విచారించింది.