Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సరిగ్గా 14 ఏండ్ల క్రితం వారం రోజుల ముందు అమెరికాలో లేమన్ బ్రదర్స్ దివాళాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి జారింది. ఇదే నేపథ్యంతో స్విజ్జర్లాండ్‌లోని అతిపెద్ద విత్త సంస్థ క్రెడిట్ సూసె తాజాగా ప్రపంచ దేశాలను భయపడుతోంది. ఏడా ది కాలంలో ఈ కంపెనీ షేర్ విలువ 55శాతం పతనమై మార్కెట్ కాపి టలైజేషన్ 11 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.90వేల కోట్లు)కు పడి పోయింది. ఇది భారత్‌లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఇండుస్ ఇండ్ బ్యాంక్‌ల విలువ కంటే తక్కువ కావడం ఆం దోళనకరం. యూరప్‌లో అతిపెద్ద బ్యాంక్‌గా పేరున్న క్రెడిట్ సుస్సె త్వర లోనే దివాలా తీయడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు. కాగా.. గత కొన్ని రోజులుగా కంపెనీ షేరు ధర అమాంతం పడుతూ వస్తోంది. గత ఆరు నెలల్లో కంపెనీ మార్కెట్ విలువ 50 శాతం తగ్గింది. మరో వైపు ఈ కంపెనీ 'క్రెడిట్ డీఫాల్ట్ స్వాప్స్ (సీడీఎస్)..అంటే ఆ సంస్థ కూడా ఇతర సంస్థల వద్ద తీసుకున్న అప్పుల ప్రీమియం భారీ స్థాయిలో పెరిగింది. మరోవైపు చాలా మంది ఉద్యోగులు కంపెనీని వీడుతున్నా రు. ఈ పరిణామాలు ఆ సంస్థను దివాళా దిశగా నెట్టుతున్నాయని రిపోర్టులు వస్తున్నాయి. ఆ పరిస్థితేమీ రాదని, బ్యాంక్ ఆర్థిక పునాదు లు బలంగానే ఉన్నాయని క్రెడిట్ సుస్సె సిఇఒ ఉరిచి కొర్నర్ పేర్కొన్నారు.