Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత సేవల రంగ కార్యకలాపాల్లోనూ తగ్గుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్లో కొత్త ఆర్డర్లు తగ్గడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కంపెనీల మధ్య పోటీ తదితర అంశాలు సేవల రంగాన్ని ఆరు నెలల కనిష్ఠానికి పడిపోయేలా చేశాయని ఎస్అండ్పి గ్లోబల్ 'పర్చేజింగ్ మానుఫాక్చరింగ్ ఇండెక్స్'లో తెలిపింది. ఈ పిఎంఐ సూచీ సెప్టెంబరులో 54.3గా నమోదయ్యింది. ఇంతక్రితం ఆగస్టులో ఇది 57.2గా ఉంది. పిఎంఐ 50 ఎగువన నమోదైతే వద్ధిగా.. దిగువన ఉంటే క్షీణతగా నిర్ణయిస్తారు. ద్రవ్యోల్బణం, పోటీ, రూపాయి భారీగా క్షీణించడం వంటి అంశాలు సేవలపై ప్రభావం చూపాయని ఎస్అండ్పి గ్లోబల్ మార్కెట్ అసోసియేట్ డైరెక్టర్ పాలీయానా డీ లిమా పేర్కొన్నారు. ఇంధన, ఆహారం, ముడి సరకులు, శ్రామికుల ఖర్చులు పెరిగిన నేపథ్యంలో మున్ముందు వ్యయాలు మరింత పెరుగొచ్చని తెలిపారు.