Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కెవడియా (గుజరాత్) : నాల్గో పారిశ్రామిక విప్లవానికి నేతృత్వం వహించే సామర్థ్యం భారత్‌కు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే తయారీ కేంద్రంగా మార్చేందుకు సంస్కరణలపై ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. వినూత్న ఆలోచనతో కూడుకున్న నూతన సాంకేతికతపైనే నాల్గో పారిశ్రామిక విప్లపం వస్తుందని మోడీ అన్నారు. శుక్రవారం నాడు ఇక్కడ భారీ పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రధాని పంపిన సందేశాన్ని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చదివి వినిపించారు. 'వివిధ కారణాల చేత, ఇప్పటి వరకూ సంభవించిన పారిశ్రామిక విప్లవాల్లో భారత్ భాగం కాలేకపోయింది. నాల్గో పారిశ్రామిక విప్లవానికి నేతృత్వం వహించే సత్తా భారత్‌కు ఉంది' అని మోడీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే తదితరులు ప్రసంగించారు. కర్ణాటకు 100, గుజరాత్‌కు 75 ఇవి బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వర్చువల్‌గా పాల్గొన్నారు.