Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్: తమ ప్రభుత్వ హయాంలో సాధించిన లక్ష్యాలను బీజేపీ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటూ, అసత్యా లను ప్రచారం చేస్తోందని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు, మాజీ మంత్రి ఫరూక్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలు, వాస్తవాలు రెండూ వేర్వేరు అంశాలని పేర్కొన్నారు. జమ్ముకాశ్మీర్లో గత ప్రభుత్వాలు చెత్త పాలన సాగిం చాయనీ... ప్రజల చేతుల్లో రాళ్లు, తుపా కులు ఉంచాయని కేంద్ర హౌం మంత్రి అమిత్షా ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఈ వ్యాఖ్య లపై ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. తమ పాలనలో జమ్ముకాశ్మీర్ అభివృద్ధి పథంలో నడిచిందనీ, ప్రజలు రాజ కీయంగా, సామాజికంగా, ఆర్థికంగా సాధికారతను సాధించారని పేర్కొ న్నారు. భారీ అభివృద్ధి కార్య క్రమాలను చేపట్టామని అన్నారు. గత 35 ఏండ్లలో తన సహౌద్యోగు లు తమ జీవితాలను త్యాగం చేశారనీ, తుపాకుల తూటాలకు ఎన్సీ నేతలు, కార్యకర్తలు బలయ్యారనీ, చాలా మంది గాయపడ్డారని అన్నారు. ఆ తుపాకులను తాము పంపిణీ చేసినట్టు అమిత్ షా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగిందనేది అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.