Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గత తొమ్మిది నెలల్లో పాకిస్థాన్ కస్టడీలో ఉన్న ఐదుగురు భారతీయ జాలర్లు సహా ఆరుగురు మృతి చెందారని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ శుక్రవారం వెల్లడించింది. శుక్రవారం మీడియా సమావేశంలో విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందామ్ భగ్చి ఈ వివరాలు వెల్లడించారు. 'ఈ సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ అంశాన్ని ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా పాకిస్థాన్ ప్రభుత్వం ముందు లేవనెత్తాం. భారత ఖైదీలకు రక్షణ, భద్రతను కల్పించడం పాకిస్థాన్ బాధ్యత' అని చెప్పారు.
అంతర్జాతీయ సముద్ర సరిహద్దుకు సమీపంలో మునిగిపోతున్న పడవ నుంచి ఆరుగురు భారతీయ జాలర్లను రక్షించామని పాకిస్థాన్ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది.