Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజేఐ యుయు లలిత్‌కు న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లేఖ
న్యూఢిల్లీ : తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు సిఫార్సు చేయాలని ప్రస్తుత సీజేఐ జస్టిస్ యుయు లలిత్‌కు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లేఖ రాశారు. జస్టిస్ యుయు లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. సీనియారిటీ కన్వెన్షన్ ప్రకారం సీజేఐ లలిత్ తరువాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ డివై చంద్రచూడ్ సీజేఐగా బాధ్యతలు చేపట్టాలని సిఫార్సు చేస్తారు. జస్టిస్ చంద్రచూడ్ రెండేండ్ల పాటు సీజేఐ పదవిలో కొనసాగుతారు.