Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి ఇవి స్కూటర్ ఆవిష్కరణ
ముంబయి : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్ విద్యుత్ వాహన రంగంలోకి ప్రవేశించింది. శుక్రవారం ఈ కంపెనీ కొత్తగా విడా వి1, వి1 ప్రొ పేర్లతో ఇవిలను ఆవిష్కరించింది. వీటిని ఆ కంపెనీ అనుబంధ సంస్థ విడా బ్రాండ్ క్రింద విడుదల చేసింది. విడా వి1 ధరను రూ.1.45 లక్షలుగా, విడా ఫ్రో ధరను రూ.1.59 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపింది. అక్టోబర్ 10న బుకింగ్‌లను ప్రారంభించనున్నట్లు తెలిపింది. వి1 ఒక్క చార్జింగ్‌తో 143 కిలోమీటర్లు, విడా ప్రో మోడల్‌తో 165 కిలోమీటర్ల ప్రయాణించవచ్చని వెల్లడించింది.