Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : అపారకుబేరుడు ముకేష్ అంబానీ ప్రపంచ దేశాల వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో సింగ పూర్లో నూతన కార్యాలయం తెరువనున్నారని రిపోర్టులు వస్తున్నాయి. ఇందుకోసం స్థలాన్ని కూడా ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఏర్పాటు చేయనున్న ఫ్యామిలీ ఆఫీస్ నిర్వహణ, సిబ్బంది నియామకాల కోసం ప్రత్యేకంగా ఇప్పటికే ఓ మేనేజర్‌ను నియమించినట్టు సమాచారం. ఏడాదిలోగా అక్కడి నుంచి వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.