Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రపంచ మార్కెట్లో భారత కరెన్సీ విలువ మునుపెన్నడూ లేని విధంగా పడిపోతోంది. శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో ఏకంగా 82.43కు క్షీణించి ఆల్‌టైం రికార్డ్ కనిష్టాన్ని చవి చూసింది. ఉదయం 15 పైసల క్షీణతతో ప్రారంభమై.. ఓ దశలో 82.43కు దిగజారి.. తుదకు 44 పైసలు పతనమై 82.32 వద్ద ముగిసింది. ఇంతక్రితం సెషన్లో ఈ కరెన్సీ 81.88 వద్ద నమోదయ్యింది. దీంతో వరుసగా నాలుగో వారంలోనూ రూపాయి విలువ పడిపోయినట్లయ్యింది. ఈ ఒక్క వారంలోనే 1.2 శాతం విలువ కోల్పోయింది.