Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐ డైర్టకర్కు వైఎస్ షర్మిల వినతి
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కుంభకోణం జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నాడిక్కడ సీబీఐ డైరెక్టర్ సుభోద్ కుమార్ జైస్వాల్‌ను వైఎస్ షర్మిల కలిసి వినతిపత్రం సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపించాలని కోరామనీ, దీనికి డీఐజీ ర్యాంక్ అధికారితో విచారణ జరిపిస్తామని సీబీఐ డైరెక్టర్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, అది విభజన రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోమని, ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా రాలేదనీ, కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక ఎమ్మెల్యేతో లోపాయికార ఒప్పందం కుదుర్చుకుంటే వచ్చిందని ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నిక వీధిలో కుక్కల కోట్లాటలా ఉందని విమర్శించారు.