Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి డీఎంకే అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన ఆ పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయనను ఏకక్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పార్టీ జనరల్ సెక్రెటరీగా దురై మురుగన్‌ను, కోశాధికారిగా టీఆర్ బాలును ఎన్నుకున్నారు. ఈ ముగ్గురు నేతలు ఈ పదవులకు రెండోసారి ఎన్నిక కావటం గమనార్హం. పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన స్టాలిన్‌కు ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. తమిళనాడువ్యాప్తంగా డీఎంకేలో వివిధ స్థాయిల ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నికలు జరిగాయి. స్టాలిన్ గతంలో డీఎంకే కోశాధికారిగా, యువజన విభాగం కార్యదర్శిగా పని చేశారు. 2018లో కరుణానిధి మరణానంతరం స్టాలిన్ డీఎంకే అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.