Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజధానిలో భారీ వర్షాలు
- 24 గంటల్లో రికార్డుస్థాయిలో నమోదు
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో నగరం అతలాకుతలమైంది. ఢిల్లీలోని పలు వీధుల్లో నదులను తలపించాయి. కాలనీల్లో నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, ఢిల్లీలో ఈ స్థాయిలో వర్షాలు పడటం దశాబ్దకాలంలోనే అధికం కావటం గమనార్హం. పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. గత 24 గంటల్లో ఢిల్లీలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైందని ప్రయివేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ఉపాధ్యక్షుడు మహేశ్ పలావట్ చెప్పారు. గత దశాబ్దకాలంలో ఢిల్లీలో అక్టోబరులో ఈ స్థాయి వర్షాలు ఎప్పుడూ నమోదు కాలేదన్నారు. శనివారం నుంచి ఇప్పటి వరకు 74 మిల్లీమీటర్ల(ఎంఎం) వర్షపాతం నమోదైందని తెలిపారు. ఉష్ణోగ్రతలు పది డిగ్రీల మేర పడిపోయాయన్నారు. సోమవారం వర్షాలు తగ్గే అవకాశం కనిపిస్తున్నాయని చెప్పారు. ఒక్క ఢిల్లీని మాత్రమే కాదు.. శివారు ప్రాంతాలైన ఫరీదాబాద్, గురుగ్రామ్, నోయిడాలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.