Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్లో బీజేపీ ఓడిపోవాలన్నదే వారి మనోగతం : కేజ్రీవాల్
న్యూఢిల్లీ:గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఆ రాష్ట్రంలో బీజేపీని ఓడించాలని ఆ పార్టీ కార్యకర్తలే భావిస్తున్నారని, రహస్యంగా ఆప్‌కు మద్దతు ఇస్తున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ కన్వీనర్‌గా ఉన్న ఆయన, గుజరాత్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండు రోజుల గుజరాత్ పర్యటన లో భాగంగా పంజాబ్ సీఎం భగవత్ మన్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని కేజ్రీవాల్ చేపట్టారు. వల్సాద్ జిల్లాలో జరిగిన ప్రచార ర్యాలీలో కేజ్రీవాల్ ప్రసంగిస్తూ..''మీరు ఒకవేళ ఆప్ పార్టీలో చేరితే..మీ వ్యాపారాన్ని బీజేపీ నాయకులు దెబ్బతీయవచ్చు. కాబట్టి మీరు అక్కడే ఉండండి. కానీ రహస్యంగా మాకోసం పనిచేయండి. కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ భయం లేదు. ఎలాంటి భయం లేకుండానే ఆప్‌లో వారు చేరొచ్చు. రాష్ట్ర ప్రజలు బీజేపీ పాలనతో విసిగిపోయారు. ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారు. గత 27ఏండ్లుగా బీజేపీ పాలనతో ప్రజలకు ఒనగూడిందేమీ లేదు. ఒక కొత్త గుజరాత్ కోసం ప్రతి ఒక్కరు కలవాలి. ఇక్కడ పార్టీ ముఖ్యం కాదు. రాష్ట్రం, దేశ ప్రయోజనాలు ముఖ్య''మని అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి ఆప్ గట్టి పోటీ ఇవ్వబోతోందని వార్తలు వెలువడు తున్నాయి. వివిధ నగరాల్లో ఆప్ నాయకులు, కార్యకర్తల హడావిడి పెరిగింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు కేజ్రీవాల్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలే దేవుళ్లని, వారి మద్దతు కోరుతున్నాడు. రాక్షస పాలనను అంతమొందించడానికే ఇక్కడికి వచ్చా''నని కేజ్రీవాల్ చెప్పుకుంటున్నారు.