Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: .కొలీజియంలో సభ్యు లంతా చర్చించి కలిసి తీసుకోవాల్సిన న్యాయమూర్తుల నియామకం నిర్ణయంపై లేఖ ద్వారా అంగీకారం తెలపాలని సీజేఐ జస్టిస్ యుయు లలిత్ కోరడంపై ఇద్దరు కొలీజియం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్య సాధ్యం కాదంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అడ్డుకున్నారు.
ఒకవైపు న్యాయమూరుల నియామకంపై కొలిజియం సభ్యు లు ఏకాభిప్రాయానికి రాకపోడం, మరోవైపు తదుపరి సీజేఐ పేరు తెలపాలంటూ సీజేఐ జస్టిస్ యుయు లలిత్‌ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరడంతో సెప్టెంబరు 30 నాటి సమావేశం చర్చలు ముగిసి నట్టు కొలిజియం ఓ ప్రకటనలో తెలి పింది.''సెప్టెంబరు 26న సీజేఐ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలో జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజరు కిషన్‌కౌల్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ కెఎం జోసెఫ్‌లతో కూడిన కొలీజియం సమావేశమైంది.సెప్టెంబ రు 26నాటి సమావేశంలో తొలి సారి న్యాయమూర్తుల తీర్పులు పరిశీలించి పదోన్నతిపై నిర్ణయం తీసుకోవాలన్న ప్రక్రియ ప్రారంభమైంది.