Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టులో హాజరు.. మూడు రోజుల కస్టడీ
న్యూఢిల్లీ :ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్‌కు చెందిన బోయిన్పల్లి అభిషేక్‌రావును సీబీఐ అరెస్టు చేసింది. సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టులో ఆయనను హాజరు పర్చగా.. మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు నుంచి సీబీఐ ప్రధాన కార్యాలయానికి అభిషేక్‌రావును తరలించారు. మూడు రోజుల పాటు ఆయనను సీబీఐ ప్రశ్నించనుంది. అక్టోబర్ 13న తిరిగి అభిషేక్ రావును సీబీఐ కోర్టులో హాజరు పరుస్తారు. ఈ కేసులో ముంబయికి చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఓన్లీ మచ్ లౌడర్ మాజీ సిఈఓ, వ్యాపారవేత్త విజరు నాయర్‌ను రెండు వారాల కిందట సీబీఐ అరెస్టు చేసింది. ఆ తరువాత ఈడి మనీలాండరింగ్ విచారణలో ఢిల్లీలోని జోర్బాగ్కు చెందిన మద్యం వ్యాపార సంస్థ ఇండోస్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రుడిని అరెస్టు చేసింది. అభిషేక్‌రావు అరెస్టుతో ఈ కేసులో ఇప్పటి వరకు మూడు అరెస్టులు అయ్యాయి.