Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వీకరణకు సుప్రీం కోర్టు నిరాకరణ
న్యూఢిల్లీ : ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలన్న పిటిషన్ ను స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా కేంద్ర ప్రభు త్వాన్ని ఆదేశించాలని కోరుతూ గోవం శ్ సేవా సదన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణకు నిరాకరించింది. ఏ ప్రాథమిక హక్కును దెబ్బతీస్తోందని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇలాంటి విషయాలను నిర్ణయించడం కోర్టు పని కాదని స్పష్టం చేసింది. ''ఇది కోర్టు పని కాదా?. మేం ఖర్చులు విధించమని ఒత్తిడి చేస్తే మీరు అలాంటి పిటిషన్ల ను ఎందుకు దాఖలు చేస్తారు? ఏ ప్రాథమిక హక్కు ప్రభావిత మవుతుంది? మీరు కోర్టుకు వచ్చినందున చట్టాన్ని గాలికి విసిరివేస్తారా?'' అని కోర్టు ప్రశ్నిం చింది. దీనికి పిటిషనర్ తరపు న్యాయవాది సమాధానమిస్తూ గోసంరక్షణ అనేది చాలా ముఖ్యమైన అంశమని అన్నారు. ''ప్రభుత్వం దానిని పరిగణించ నివ్వండి. నేను బలవంతం చేయడం లేదు. మేం ఆవుల నుంచి ప్రతిదీ పొందుతున్నాం'' అని అన్నారు. అయితే ఈ పిటిషన్‌ను స్వీకరించ డానికి కోర్టు నిరాకరించింది. పిటిషనర్ ఉపసంహరించుకోవాలని సూచించింది.