Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
న్యూఢిల్లీ : రుణ ఎగవేతదారుల ఆస్తులు జప్తు చేయాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. 11 ఏండ్లలో పెద్ద బడాబాబులకు చెందిన రూ.1.29 లక్షల కోట్ల మొండి బకాయిలు రద్దు చేశారని తెలిపారు. మతతత్వ, కార్పొరేట్ కలయకను మోడీ ఆశ్రయించారనీ, ఈ దోపిడిని క్రోనీలు చేస్తున్నారని విమర్శించారు. రుణ ఎగవేతదారుల ఆస్తులను జప్తు చేయాలనీ, వారిని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బ్యాంకు ఖాతాల్లో ప్రజల జీవితకాల పొదుపులను తిరిగి ఇవ్వాలని అన్నారు.