Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్ల్లీ : కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును అక్టోబరు 18న తగిన ధర్మాసనం విచారిస్తుందని సీజేఐ జస్టిస్ యు.యు లలిత్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణ తేదీ నిర్ణయించాలని కర్నా టక తరపు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ మంగళవారం సీజేఐ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన అక్టోబర్ 18న విచారిస్తామని తెలిపారు.