Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్యానికి కారణం 'మహా' ప్రభుత్వమే
- నిందితుడి బెయిల్ రద్దు పిటిషన్‌పై బాంబే హైకోర్టు
ముంబయి : ప్రముఖ హేతువాది, సామాజిక కార్యకర్త గోవింద్ పన్సారే హత్య కేసులో ప్రధాన నిందితుడి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ ఆలస్యం కావటానికి గల కారణం మహారాష్ట్ర ప్రభుత్వం తీరేనని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. నిందితుడు వీరేంద్రసిన్హ్ తావ్డే బెయిల్‌ను రద్దు చేయాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ 2018 నుంచి పెండింగ్‌లో ఉన్నదని న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ కోత్వాల్ అన్నారు. కేసును వాయిదా వేయాలన్న పబ్లిక్ ప్రాజిక్యూటర్ వ్యాఖ్యలకు స్పందనగా న్యాయమూర్తి పై విధంగా మాట్లాడారు. ఈ కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి వచ్చేనెల 22కు వాయిదా వేశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ సిటీలో గోవింద్ పన్సారేను ఇద్దరు గుర్తు తెలియని దుండగులు 2015, ఫిబ్రవరి 16లో తుపాకితో కాల్చి చంపిన విషయం విదితమే. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు తావ్డేను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ 2016లో అరెస్టు చేసింది. అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనను కస్టడీలోకి తీసుకున్నది. హత్య కేసులో కీలక వ్యక్తి ఇతననేని దర్యాప్తు బృందం వెల్లడించింది. కేసు విచారణ ఇంకా ప్రారంభం కాకముందే కొల్హాపూర్‌లోని సెషన్స్‌కోర్టు 2018లో ప్రధాన నిందితుడికి బెయిల్ మంజూరు చేయటం గమనార్హం.