Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ :మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ ఎస్.మురళీధర్ బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపి వేసింది. కర్నాటక, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్ హైకోర్టు ల్లో ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సంబం ధించి సెప్టెంబర్ 28న సుప్రీం కోర్టు కొలీజియం చేసిన మూడు సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమో దించింది. అయితే ప్రస్తుతం ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎస్.మురళీధర్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయడానికి సంబంధిం చిన సిఫారసును మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆమోదిం చలేదు. జమ్ముకాశ్మీర్, లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మిథాల్‌ను రాజస్థాన్ హైకోర్టుకు, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్. మురళీధర్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సెప్టెంబర్ 28న సుప్రీం కోర్టు కొలీజియం తీర్మానం చేసింది. అయితే జస్టిస్ ఎస్.మురళీధర్ ప్రతిపాదనను పట్టించుకోకుండా, జస్టిస్ పంకజ్ మిథాల్ బదిలీకి మాత్రమే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. జస్టిస్ పిబి వరాలేను కర్నా టక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్ అలీ మహ్మద్ మాగ్రేను జమ్ముకాశ్మీర్, లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది.
ఇప్పటి వరకు ముగ్గురికి సంబంధించిన కొలీజియం సిఫారసులను ఆమోదించని కేంద్రం
కొలీజియం తీర్మానాలను కేంద్రం విభజించడం గతంలో విమర్శలకు గురైంది. ముఖ్యంగా సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణియం (2014), జస్టిస్ కెఎం జోసెఫ్ (2018), జస్టిస్ అకిల్ కురేషి (2019)లకు సంబందించిన ప్రతిపాదనలను నిలిపి వేసి, కొలీజియం తీర్మానాన్ని విభజించడంతో విమర్శ లు వెల్లువెత్తాయి. జస్టిస్ మురళీధర్ 1984 సెప్టెం బర్లో చెన్నైలో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించా రు. 1987లో ఆయన సుప్రీం కోర్టు, ఢిల్లీ హైకోర్టుకు మారారు. 2006లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి గా నియమితులయ్యారు. 2009లో నాజ్ ఫౌండేషన్ కేసులో స్వలింగ సంపర్కాన్ని తొలిసారిగా చట్టబద్ధం చేసిన హైకోర్టు ధర్మాసనంలో ఆయన భాగంగా ఉ న్నారు. హషీంపురా ఊచకోత కేసులో ఉత్తరప్రదేశ్ ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కాన్స్టాబులరీ (పిఎసి) సభ్యుల ను, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్‌ను దోషులుగా నిర్ధారిం చిన డివిజన్ బెంచ్‌కు ఆయన నాయకత్వం వహిం చారు. 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించి బిజెపి నేతలు అనురాగ్ ఠాకూర్, ప్రవేశ్ వర్మ, అభరు వర్మ, కపిల్ మిశ్రా వంటి రాజకీయ నాయకుల రెచ్చగెట్టే ప్రసంగాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించిన వెంటనే ఆయనను రాత్రికి రాత్రి (2020 ఫిబ్రవరి) పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ సమయంలో ఆయన ఢిల్లీ హైకోర్టులో మూడో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. 2021 జనవరిలో జస్టిస్ మురళీధర్ ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన నాయకత్వంలో ఒడిశా హైకోర్టు ట్రయల్ ప్రాతిపదికన ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించారు.