Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా...
- పీఎం-డిఈవిఐఎన్ఈ పథకానికి ఆమోదం
- కేంద్ర మంత్రి వర్గం నిర్ణయాలు
న్యూఢిల్లీ . ప్రభుత్వరంగ చమురు సంస్థలకు కేంద్రం భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. ఆయా సంస్థలకు రెండేండ్ల కాలానికి రూ.22 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గం సమావేశం జరిగింది. అనంతరం నేషనల్ మీడియా సెంటర్ (ఎన్ఎంసీ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి ఎల్.మురగన్లు కేంద్ర మంత్రి వర్గ నిర్ణయాలను వివరించారు. కీలక నిర్ణయాలను తీసుకున్నది. చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొ రేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సంస్థలకు పరిహారం ఇవ్వాలని కేంద్రపెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ తీసుకు వచ్చిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. గత రెండేండ్లలో (2020 జూన్ నుంచి 2022 జూన్ వరకు) వంటగ్యాస్ విక్రయాల్లో వచ్చిన నష్టాన్ని భర్తీ చేసేందుకు వీలుగా ఆయా సంస్థలకు ఒకసారి (వన్‌టైం) గ్రాంటు కింద రూ.22 వేల కోట్లు ఆర్థిక సాయం ఇవ్వను న్నట్లు తెలిపింది. గత రెండేండ్ల కాలంలో అంతర్జాతీయంగా వంటగ్యాస్ ధరలు దాదాపు 300 శాతం పెరిగినప్పటికీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఈ మూడు సంస్థలు విని యోగదారులకు వంటగ్యాస్ సరఫరా చేసినట్టు తెలిపింది.
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనం బోనస్
రైల్వేలో నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ఉత్పత్తి ఆధారిత బోనస్(పీఎల్బీ)కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 78 రోజుల వేతనాన్ని బోనస్‌ను ఇవ్వనుంది. ఇందు కోసం రూ.1,832.09 కోట్లు కేటాయించనుంది. పీఎల్బీ చెల్లింపులకు గాను నెలకు రూ. 7 వేల చొప్పున లెక్కించి అర్హులైన 11.27 లక్షల మంది ఉద్యోగులకు బోనస్ ఇవ్వనుంది. దీంతో ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.17,951 చొప్పున బోనస్‌గా వచ్చే అవకాశం ఉంది.
పీఎం-డిఈవిఐఎన్ఈ పథకానికి లైన్ క్లియర్
2022-23 నుంచి 2025-26 వరకు 15వ ఆర్థిక సంఘంలో మిగిలిన నాలుగు సంవత్సరాలకు గాను ''ప్రధాన మంత్రి డెవలప్మెంట్ ఇన్సియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రిజన్ (పీఎం-డిఈవిఐఎన్ఈ)'' పథకాన్ని కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ నాలుగేళ్లలో రూ.6,600 కోట్లతో ఈ పథకం అమలు చేయబడుతుంది. అలాగే మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ చట్టం-2002ను సవరిస్తూ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ బిల్లు- 2022కు కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
రెండు పీపీపీ ప్రాజెక్టులకు ఆమోదం
ప్రభుత్వ, ప్రయి వేట్ భాగస్వామ్యం(పిపిపి)తో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ విధానంలో కాండ్లా వద్ద గల్ఫ్ ఆఫ్ కచ్ వెంబడి మల్టీపర్పస్ కార్గో (కంటైనర్, లిక్విడ్ కాకుండా) బెర్త్ అభివృద్ధికి కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2,250.64 కోట్లు ఖర్చు చేయనుంది. మొత్తం ఖర్చులో రూ.1,719.22 కోట్లలను మల్టీపర్పస్ కార్గో అభివృద్ధికి ఏర్పాటైన సంస్థ ( బెర్తు వెంబడి డ్రెడ్జింగ్ పనులు, టర్నింగ్ సర్కిల్, అప్రోచ్ ఛానల్ పనులు), మిగిలిన రూ. 531.42 కోట్లను సాధారణ వినియోగదారు యాక్సెస్ ఛానల్ నిర్మాణం, మూలధన డ్రెడ్జి ంగ్, సాధారణ వినియోగదారు రహదారి నిర్మాణం కోసం రాయితీ సంస్థ ( దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ) సమకూర్చ నున్నాయి. అలాగే ట్యూనా-టెక్రా వద్ద కంటైనర్ టెర్మినల్ అభివృద్ధి, ప్రభుత్వ, ప్రయి వేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతి లో దీనదయాల్ పోర్ట్ బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (బీఓ టీ) ప్రాతిపదికన అభివృద్ధి చేయడానికి కేంద్ర మంత్రి వర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రా జెక్టు కోసం రూ.4,243.64 కోట్ల అంచనా వ్యయం చేయనుంది.