Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ విశిష్టమైన, గొప్ప భాషా వైవిధ్యంపై 'హిందీ, హిందూ, హిందుస్థాన్' వంటి ఆర్ఎస్ఎస్ దృష్టికోణాన్ని రుద్దటం ఆమోదయోగ్యం కాదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో జాబితా చేర్చబడిన అన్ని 22 అధికారిక భాషలను సమానంగా పరిగణించాలనీ, ప్రోత్సహించాలని సూచించారు. భారతదేశం వైవిధ్యాల వేడుక అని అన్నారు. సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపి జాన్ బ్రిట్టాస్, ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్ బిశ్వాస్, ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ ధావలే, హన్నన్ మొల్లా, డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎ రహీమ్, హిమఘ్నరాజ్ భట్టాచార్య తదితరులు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు.