Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి సిఫారసు
న్యూఢిల్లీ : విద్యా సంస్థల తరగతి గదుల్లో హిజాబ్ ధారణకు సంబంధించి సుప్రీంకోర్టులో 10 రోజులపాటు విచారణ జరిపిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియా ధర్మాసనం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది. హిజాబ్ ధారణను నిషేధించడాన్ని జస్టిస్ గుప్తా సమర్థించగా, జస్టిస్ ధూలియా తిరస్కరించారు. విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్నాటక ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేస్తూ జస్టిస్ సుధాంశు ధూలియా గురువారం తీర్పు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను సమర్థిస్తూ కర్నాటక హైకోర్టు మార్చిలో ఇచ్చిన తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా తోసిపుచ్చారు. 'హిజాబ్ అనేది వారి ఎంపికకు సంబంధించినది. కానీ దీనికంటే ఉన్నతమైనది ఆడపిల్లల చదువు అని నా అభిప్రాయం' అన్నారు. దీంతో తుది తీర్పు కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి ఈ కేసును సిఫార్సు చేస్తున్నట్టు జస్టిస్ హేమంత్ గుప్తా వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్నాటక ఉడుపిలోని ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ గర్స్లో కాలేజీలో ఫిబ్రవరి 5న కొందరు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని యాజమాన్యం నిషేధించింది. దీంతో ఆ రాష్ట్రమంతా నిరసనలు వెల్లువెత్తాయి. హిజాబ్ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం విద్యార్థినులు వేసిన పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు మార్చి 15న కొట్టివేసింది. హిజాబ్‌ని నిషేధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.