Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నన్ను బెదిరించటానికి మరో తీరని ప్రయత్నం : ఈడీ చార్జిషీటుపై జర్నలిస్టు రానా అయ్యూబ్
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీటు తనను బెదిరించటానికి మరో తీరని ప్రయత్నమని ప్రముఖ జర్నలిస్టు రానా అయ్యూబ్ అన్నారు. సామాజిక సేవ, కోవిడ్-19 రిలీఫ్ కోసం ప్రజల నుంచి వసూలు చేసిన ఫండ్లలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీటులో రానా అయ్యూబ్ పేరును చేర్చింది. కొన్ని గంటల అనంతరం ఈడీ చర్యపై ఆమె పై విధంగా స్పందించారు. జర్నలిజం కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం ఆమె యూఎస్‌లో ఉన్నారు. ' నా కలం ఎన్నడూ నిశబ్దంగా ఉండదు' అని ఆమె ట్వీట్ చేశారు. '' నా పెన్ను మౌనంగా ఉండదు. భారత్‌లో పత్రికా స్వేచ్ఛపై యూఎస్‌లో నిన్ననే ఒక సెమినార్ నిర్వహించాను. దేశంలో అణగారిన వర్గాలపై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా నేను నా గళాన్ని పెంచుతాను'' ఆమె వివరించారు. ఈడీ చార్జిషీటు తనకు మీడియా ద్వారా తెలిసిందన్నారు. ''నాపై పీఎంఎల్ఏ కేసుకు ఈడీ ఉపక్రమించింది. నా ప్రొఫెషనల్ ఇన్‌కమ్‌తో పాటు బ్యాంకు ఖాతా ఫండ్స్‌ను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది. కానీ, అటాచ్మెంట్ ప్రొసీడింగ్స్‌ను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఫండ్స్ అటాచ్మెంట్ ధ్రువీకరణ కాలేదు. తీవ్ర అవసరాల్లో ఉన్న వారికి సహాయం అందించాలన్న ఏకైక లక్ష్యంతోనే కోవిడ్ సపోర్ట్ కోసం నేను నిధులు సేకరించాను. ప్రభుత్వాన్ని ప్రశ్నించి, విమర్శించే తన గొంతును అణచివేయటానికి పీఎంఎల్ఏను కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయి. జ్యుడిషిషియల్ స్క్రుటినీలో ఈడీ ప్రయత్నాలు నిలబడవు. జర్నలిస్టుగా తన వృత్తిని నిర్వర్తించటంలో నన్ను అడ్డుకోరు'' అని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.