Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత ఓట్ల ప్రకారమే ఎన్నిక నిర్వహించాలి
- సీఈసీకి బీజేపీ నేతలు ఫిర్యాదు
న్యూఢిల్లీ : మునుగోడులో 25 వేల బోగస్ ఓట్లు నమోదు చేసుకున్నారనీ, కనుకు పాత ఓట్ల ప్రకారమే ఎన్నిక నిర్వహించాలని బీజేపీ నేతలు కోరారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర మంత్రి మురళీధరన్, ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి, బీజేపీ నేతలు తరుణ్ చుగ్, రామచంద్రరావు తదితరులు కలిశారు. ఆగస్టు 1 నుంచి ఇప్పటి వరకు 25 వేలు ఓట్లు చేర్చారనీ, జనవరి 1 నుంచి జులై 31 వరకు మునుగోడు నియోజకవర్గంలో రెండు వేలు మాత్రమే ఓట్ల కోసం దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కనుక జులై 31 వరకు ఉండే ఓట్లతో మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని అన్నారు. నకిలీ ఓటర్లను తొలగించాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మోహరించారని విమర్శించారు. గత నాలుగేండ్ల నుంచి ఉన్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నారని, వారిని బదిలీ చేయాలని కోరారు. కేంద్ర బలగాలను, ఎన్నికల పరిశీలకులను మునుగోడు పంపాలని కోరినట్టు చెప్పారు. ఎన్నికల కమిషన్ దీనిపై విచారణ జరుపుతుందని హామీ ఇచ్చారని బీజేపీ నేతలు తెలిపారు.