Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ అధికారులు అరెస్టు చేసిన బోయినపల్లి అభిషేక్ రావు కస్టడీ మరో రెండు రోజులు పొడిగించారు. ఈ మేరకు గురువారం రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. అభిషేక్ రావు తరఫు న్యాయవాది శ్రీ సింగ్ వాదనలు వినిపిస్తూ గడించిన రెండు రోజులుగా కస్టడీలో విచారణ ఏమీ చేయ లేదనీ, ఈ కేసులో సీబీఐ కస్టడీలో ఉంచి విచారణ చేయాల్సిన అవసరం లేదని దర్యాప్తు కి అభిషేక్ సహకరిస్తాడని తెలిపారు. మద్యం కుంభకోణంపై అభిషేక్ రావు పాత్రపై విచారించేందుకు మరో రెండు రోజుల సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాది ఎంకె నాగ్ పాల్ కోరింది. ఈ స్కాంలో అరుణ్ రామచంద్ర పిళ్ళైకి నోటీసులు ఇచ్చామనీ, మరికొన్ని ఆధారాలు, పత్రాలు పరిశీలించాల్సి ఉందని తెలిపారు. ఇదే కేసులో ముత్తా గౌతమ్‌ను విచారణ చేస్తున్నామనీ, అరుణ్ రామచంద్ర పిళ్ళై, గౌతమ్‌తో ఉన్న సంబంధాలపై విచారించేందుకు రెండు రోజుల కస్టడీ పొడిగించాలని కోరారు. దీంతో కస్టడీ మరో రెండు రోజులు పొడిగించింది.