Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ
న్యూఢిల్లీ : హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 12న జరగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం నాడిక్కడ కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ (ఈసీ) అనూప్ చంద్ర పాండే హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ నవంబరు 12న, ఓట్ల లెక్కింపు డిసెంబరు 8న జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 17 నుంచి నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చుననీ, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 25 అనీ, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 29 అని పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి ఆందోళన ఇకలేదని చెప్పారు. మొత్తం ఓటర్ల సంఖ్య 55,74,793, అందులో ఉద్యోగులు 67,532 మంది ఓటర్లని పేర్కొన్నారు. 2022 జనవరి 1 నుంచి అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండిన తొలిసారి ఓటు హక్కు పొందిన ఓటర్లు 43,173 మంది అని తెలిపారు. 80 ఏండ్ల వయసు పైబడిన ఓటర్ల సంఖ్య 1,22,093, వికలాంగు ఓటర్ల సంఖ్య 56,001, థర్డ్ జండర్ ఓటర్ల సంఖ్య 37 అని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న 80 ఏండ్ల వయసు పైబడినవారు, అదేవిధంగా 40శాతం పైబడిన అంగవైకల్యం గలవారు తమ ఇంటి వద్ద నుంచే ఓటు వేయవచ్చునని చెప్పారు. దరఖాస్తు చేసుకోలేని వారికి పోలింగ్ స్టేషన్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన బూటకపు వార్తలు, వదంతులపై నిఘా పెట్టేందుకు సామాజిక మాధ్యమాల బృందాలను ఏర్పాటుచేశామన్నారు. రాష్ట్రంలో ఉన్న 68 శాసనసభ స్థానాల్లో 17 ఎస్సీ, మూడు ఎస్టీ రిజర్డ్వ్ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 1500 ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2017లో 7,525 పోలింగ్ స్టేషన్లు ఉంటే, 2022 నాటికి 7,881 పోలింగ్ స్టేషన్ల (దాదాపు 4.73 శాతం)కు పెంచినట్టు సీఈసీ తెలిపింది. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి 2023 జనవరి 8తో ముగియనుంది.