Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందూ ధర్మ పరిషత్ పిటిషన్ సుప్రీం తిరస్కరణ
న్యూఢిల్లీ: సీఏఏకి సంబంధించి ఎవరూ ఎటువంటి సమస్యను లేవనెత్త కూడదని హిందూ ధర్మ పరిషత్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ అభరు ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ తన దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సీఏఏ గురించి ఎవరూ లేవనెత్తడానికి అనుమతించకూడదని ఎలా అంటారని పిటిషనర్ తరపు న్యాయవాదిని జస్టిస్ కౌల్ మందలించారు. ఈ పిటిషన్ వింతగా ఉందని పేర్కొంది. అలాగే సీఏఏని సవాల్ చేస్తూ దాఖలు అయిన పిటిషన్లకు ఈ పిటిషన్ను జత చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. దీన్ని ట్యాగే చేసే ప్రశ్నే లేదనీ, మీరు అలా కోర్టును అడగగలరా? ప్రశ్నించింది. ఆర్టికల్ 32 ప్రకారం అటువంటి ఉత్తర్వును తాము అంగీకరించలేమని తెలిపింది. దీనిపై మళ్లీ పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించేందుకు ప్రయత్నించగా, జస్టిస్ కౌల్ జోక్యం చేసుకొని పిటిషన్ను ఉపసంహరించు కోవాలనుకుంటున్నారా? లేదా తమకు ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు న్యాయవాది అంగీకరించారు.