Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరువారాల పాటు గడువు
- కేంద్రంతో పాటు తెలంగాణ,ఏపీ సహా మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
న్యూఢిల్లీ :చట్టాలు నిషేధించినప్పటికీ దేవదాసీ వ్యవస్థ కొనసాగింపుపై స్పందించాలని కేంద్ర, ఆరు రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. ఆరు వారాల్లోగా స్పందన తెలియజే యాలని కోరింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలు, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖల కార్య దర్శులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు వివరణాత్మక నివేదికను కోరుతూ కమిషన్ నోటీసులు జారీ చేసింది. దేవదాసీ వ్యవస్థను నిరోధించడానికి, దేవదాసీల పునరావాసం, సామాజి క భద్రతను అందించడానికి, వారు గౌరవప్రదంగా తమ జీవితాలను నడిపించ డానికి అధికారులు తీసుకున్న చర్యలు, ప్రతిపాదిత చర్యలు నివేదకలో ఉండాలని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. అటు వంటి సామాజిక దురాచారాన్ని నిరోధించడానికి రాష్ట్రాల్లో ఏవైనా స్థానిక చట్టాలు రూపొందించబడ్డాయా? దాని నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారో? కూడా పేర్కొనాలని కోరింది.
దేశంలో వివిధ దేవాలయాలలో, ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలోని దేవదాసీ వ్యవస్థ కొనసాగుతున్న ముప్పుపై మీడియా నివేదికలను ఎన్హెచ్ఆర్సీ పరిశీలించిందని తెలిపింది. ఈ మహిళల్లో ఎక్కువ మంది పేద కుటుంబాలు, షెడ్యూల్డ్ కులాలు,షెడ్యూల్డ్ తెగలకు చెందినవారని పేర్కొంది. ఒక అమ్మాయిని దేవదాసిని చేసే ప్రక్రియలో ఆమె ఏదైనా దేవాలయంలోని దేవతను వివాహం చేసుకుందని, ఆ తర్వాత ఆమె తన జీవితాన్ని పూజారి, ఆలయ రోజువారీ కర్మలను చూసుకుంటుంది. ఈ దుర్వినియోగానికి గురైన వారిలో ఎక్కువ మంది లైంగిక వేధింపులకు గురవుతున్నారు. వారు పురుషులచే లైంగికంగా దోపిడీ చేయబడతారని పేర్కొంది. గర్భవతులుగా అవుతున్నారని తెలిపింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వరుసగా 1982, 1988లో దేవదాసీ సంప్రదాయాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాయని తెలిపింది. అయితే కర్ణాటకలోనే 70,000 మందికి పైగా మహిళలు దేవదాసీలుగా తమ జీవితాలను గడుపుతున్నారని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 80,000 మంది దేవదాసీలు ఉన్నారని జస్టిస్ రఘునాథరావు అధ్యక్షతన ఏర్పాటైన కమిషన్ నివేదిక ఇచ్చిందని పేర్కొంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దేవదాసీ అక్రమాలకు సంబంధించి కొన్నేళ్ల క్రితం ఫిర్యాదు అందిందని, నోటీసులు కూడా ఇచ్చామని తెలిపింది. నోటీసులకు ప్రతిస్పందనగా, రాష్ట్ర అధికారులు ఆరోపణలను ఖండించారని పేర్కొంది.