Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి పిలుపు
అమరావతి : బీజేపీ ప్రభుత్వంలో దేశం, ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సవాళ్లను అధిగమించాలంటే వామ పక్షాల ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు మరింత సంఘటితం కావాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ప్రత్యామ్నాయ విధానాల కోసం సాగించే పోరాటాలలో వామపక్ష, ప్రజాస్వామిక శక్తుల ఐక్యతను పెంపొందించు కోవాలని చెప్పారు. కేంద్రంలోని హిందూ మతతత్వ- కార్పొరేట్ సర్కారును పీఠం నుంచి దించేందుకు లౌకిక శక్తుల విస్తృత సమీకరణకు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడలో జరుగుతున్న సీపీఐ 24వ మహాసభ ప్రారంభ సమావేశంలో ఏచూరి పాల్గొని సౌహార్ధ సందేశం ఇచ్చారు.
మహాసభ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలిపారు. మోడీ ప్రభుత్వం ఫాసిస్టు స్వభావం కలిగిన ఆర్ఎస్ఎస్ హిందూత్వ మత ఎజెండాను దూకుడుగా అమలు చేస్తోందన్నారు. 'క్రూరమై న మత విద్వేషాన్ని రెచ్చగొడుతోంది. మైనార్టీలను, ముఖ్యం గా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని హింస, ప్రతీకార ప్రచా రాలు దాడులు సాగిస్తోంది. రాజ్యాంగంపై దాడి చేస్తూ, భారత రిపబ్లిక్ లౌకిక, ప్రజాస్వామ్య, సమాఖ్య స్వభావానికి గండి కొడుతోంది. ఆర్ఎస్ఎస్ హిందూ మతతత్వ ప్రాజెక్టును ప్రతిష్టించేందుకు ప్రయత్నిస్తోంది.' అని చెప్పారు.
ప్రభుత్వ ఆస్తులు లూటీ
మోడీ ప్రభుత్వం మతతత్వ-కార్పొరేట్లను బలోపేతం చేయడం, ప్రభుత్వ ఆస్తులను, సహజ వనరులను దోచుకోవడం, క్రోనీ కేపిటలిజాన్ని ప్రోత్సహించడం, నయా -ఉదారవాద సంస్కరణల క్రూరమైన దాడిని అన్ని వైపుల నుంచి ఎక్కుపెట్టిందని ఏచూరి తెలిపారు. 'భారత రాజ్యాం గం యొక్క మూల స్తంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, ఆర్థిక సార్వభౌమాధికా రం దాడికి గురవుతున్నాయి. ప్రభుత్వంపై అసమ్మతి తెలిపే ప్రతి ఒక్కరిపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. పార్లమెం ట్, న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ మొదలైన వాటిలో ప్రభుత్వ జోక్యం, ఆక్రమణ పెరుగుతోంది. రాజకీయ ప్రత్యర్ధులపై సీబీఐ, ఈడి వంటి వాటిని ఆయుధాలుగా చేసుకుంది. మీడియానూ నియంత్రిస్తోంది. హిందూ మత భావజాలం, అశాస్త్రీయ వాదనలు, మూఢ నమ్మకాలతో ప్రజల మెదళ్లను కలుషితం చేస్తోంది. విదేశాంగ విధాన పరంగా అమెరికాకు జూనియర్ భాగస్వామిగా మారి పోయింది. ఇజ్రాయిల్‌తో వ్యూహాత్మక సంబంధాన్ని సుస్థిరం చేసుకొని పాలస్తీనా విషయంలో సంప్రదాయ మద్దతును, సంఘీభావాన్ని పలచన చేసింది' అని అన్నారు. .
ప్రతిఘటన పెరుగుతోంది
భారత రాజ్యాంగంపై దాడికి వ్యతిరేకంగా ప్రజల నుంచి ప్రతిఘటన పెరుగుతోందని ఏచూరి అన్నారు. 'ఏడాది పొడవునా సాగిన రైతుల పోరాటం, సిఎఎకు వ్యతి రేకంగా జరిగిన ఆందోళనలు, కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా సమ్మెలు ఈ కాలంలో జరిగాయి. రైతులు, వ్యవసాయ కార్మికులు భారీ సమీకరణలు చేపట్టారు. కార్మి కులు సంయుక్త పోరాటాలకు పిలుపునిచ్చారు. ప్రజల ఐక్యతను పెంచడానికి వామపక్ష శక్తుల ఐక్యత అవసరం ఉంది. కోవిడ్ విలయం, నిరుద్యోగం, అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల జీవనోపాధిని మెరుగు పర్చడం, భారతదేశ లౌకిక, ప్రజాస్వామ్య స్వభా వాన్ని కాపాడటం, మెరుగైన భారతదేశాన్ని సృష్టించే దిశగా ముందుకు సాగడం లక్ష్యంగా ఉండాలి' అని ఏచూరి చెప్పారు. తెలుగు ప్రాంతం, విజయవాడ కమ్యూనిస్టుల విప్లవాత్మక కార్యకలాపాలకు కేంద్రంగా ఉందన్నారు. వీర తెలంగాణ సాయుధ పోరాటం భూసంస్కరణల ఎజెండా ను, జమిందారీ వ్యవస్థ రద్దునకు ప్రభుత్వాల మెడలు వం చిందన్నారు. ఇక్కడ జరుగుతున్న సిపిఐ మహాసభ కమ్యూనిస్టు శక్తులను మరింత ఏకీకృతం చేస్తుందని ఆకాంక్షించారు.
రాజ్యాంగ పరిరక్షణకు మరో స్వాతంత్య్రోద్యమం : దీపాంకర్ భట్టాచార్య
మతతత్వశక్తుల పాలనలో దేశ ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల సాధన కోసం మరో స్వాతంత్య్ర ఉద్యమం చేయాల్సి ఉందని సిపిఐఎంఎల్ లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య అన్నారు. దీనికి కమ్యూనిస్టులు నాయకత్వం వహించి ప్రజా పోరాటాలను నిర్మించాలని సూచించారు. రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కమ్యూనిస్టులు తమ శక్తియుక్తులన్నింటినీ వినియోగించి ఐక్యంగా పోరాడాలని అన్నారు. భగత్ సింగ్, అంబేద్కర్, పూలే, పెరియార్ తదితరుల కలలను నిజం చేసేందుకు ప్రజాస్వామ్య పునాదులను మరింత పటిష్టంగా పునర్నిర్మిం చుకోవాల్సిన ఆవశ్యకత దేశంలో నెలకొందని చెప్పారు.