Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపార్టీలో చేరుతానో త్వరలో ప్రకటిస్తా
- మీడియాతో బూర నర్సయ్య గౌడ్
న్యూఢిల్లీ : తాను అవమానానికి గురయ్యానని రాజీనామా చేసిన టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. శనివారం నాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ మునుగోడు అభ్యర్థిగా బీసీని పరిశీలించమని చెబితే అవమానిస్తారా? అని ప్రశ్నించారు. తాను ఏ పార్టీలో చేరుతాననేది తన వర్గం నేతలతో చర్చించి వెల్లడిస్తానని తెలిపారు. బీజేపీతో సంప్రదింపులు జరిగాయనీ, అంతిమ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. తనను అన్ని పార్టీలవారు సంప్రదిస్తున్నారనీ, నియోజకవర్గానికి వెళ్లి కార్యకర్తలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే రాజకీయాల్లోకి వచ్చాననీ, ఐదేండ్లపాటు తెలంగాణ అభివృద్ధి కోసం అవినీతి మరకలు లేకుండా పని చేశానని అన్నారు.