Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బోయినపల్లి అభిషేక్ రావుకు సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బోయినపల్లి అభిషేక్ రావును ఈ నెల 9న సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ చేపట్టారు. విచారణ కోసం మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధించారు. తరువాత మళ్లీ రెండు రోజుల పాటు కస్టడీ విధించారు. శనివారం మళ్లీ సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఆయన సీబీఐ కస్టడీ ముగిసింది. కాగా, ఆయనకు 14 రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.