Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భోపాల్ : ఎంబీబీఎస్ హిందీ మాధ్యమ పుస్తకాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ విద్యావిధానంలో భాగంగా హిందీలో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించామన్నారు. మధ్యప్రదేశ్‌లో 2022-23 విద్యా సంవత్సరానికిగాను ప్రభుత్వ మెడికల్ కళాశాల్లోని మొదటి ఏడాది విద్యార్థులకు హిందీలో మెడిసిన్‌ను బోధించనున్నటు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అనాటమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల పుస్తకాలు హిందీలో అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఆంగ్లంతోపాటు హిందీ పుస్తకాలు అందుబాటులో ఉంటాయని, సాంకేతిక పదాలు ఇంగ్లీష్‌లోనే ఉంటాయని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ స్పష్టం చేశారు.