Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజేఐగా జస్టిస్ డివై చంద్రచూడ్
బాధ్యతల స్వీకరణ తరువాత సంఖ్య పెరపు
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ డివై చంద్రచూడ్ నవంబర్ 9న బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆరుగురు సభ్యులతో సుప్రీం కోర్టు కొలీజియం ఏర్పాటు కానున్నది. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన సుప్రీం కోర్టు కొలీజియం ప్రస్తుతం ఐదుగురు సభ్యులతో కొనసాగుతో ంది. సుప్రీం కోర్టులో సీజేఐతో సహా 34 మంది న్యాయమూర్తుల ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 28 మాత్రమే ఉన్నారు. ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ముంబయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సీజేఐ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని కొలీజియం సెప్టెంబర్ 26న కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆ ప్రతిపాదనను కేంద్రం త్వరలో ఆమోదించనున్నది. సీజేఐగా జస్టిస్ డివై చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన కొలీజియంలో న్యాయమూర్తులు జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ ఎంఆర్ షాల్లో ఎవరూ సీజేఐగా నియమితులయ్యే అవకాశం లేదు. ఎందుకంటే వీరంతా జస్టిస్ చంద్రచూడ్ పదవీకాలంలోనే పదవీవిరమణ చేస్తారు. జస్టిస్ సంజరు కిషన్ కౌల్ (2023 డిసెంబర్ 25), జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ (2023 జనవరి 4), జస్టిస్ కెఎం జోసెఫ్ (2023 జూన్ 16), జస్టిస్ ఎంఆర్ షా (2023 మే 15)న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ చంద్రచూడ్ తరువాత 2024 నవంబర్ 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐ అవుతారు. దీంతో ఆయనను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియంలోకి తీసుకుంటారు.