Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోమవారం విచారించనున్నది. ఈ మేరకు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఆగస్టు 17న నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సిసోడియా 15వ నిందితుడిగా ఉన్నారు. సీబీఐ తనను విచారించనున్న సందర్భంగా సిసోడియా స్పందించారు. 'సీబీఐ మా ఇంటిలో 14 గంటల పాటు సోదాలు జరిపి ఏదీ కనుగొనలేకపోయింది. నా బ్యాంక్ లాకర్ శోధించినా ఏమీ దొరకలేదు. నా గ్రామంలోనూ వారు ఏదీ కనిపెట్టలేకపోయారు. ప్రస్తుతం రేపు ఉదయం 11 గంటలకు సిబిఐ ప్రధాన కార్యాలయానికి రమ్మని పిలిచారు. నేను వెళ్లి పూర్తిగా సహకరిస్తాను. సత్యమేవ జయతే' అని సిసోడియా ఆదివారం ట్వీట్ చేశారు.