Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రూపాయి క్షీణించడం లేదని, డాలర్ బలపడుతోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికవ్యవస్థ, కరెన్సీలతో పోలిస్తే రూపాయి చాలా మెరుగ్గా ఉందని అన్నారు. ఇటీవల రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 82.69కి పడిపోయిన సంగతి తెలిసిందే. రూపాయి విలువ మరింత క్షీణించకుండా చూస్తామని అమెరికా పర్యటనలో ఉన్న ఆమె విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. రూపాయి విలువను స్థిరీకరించడానికి ఆర్బీఐ ప్రయత్నిస్తోందని అన్నారు.
భారతీయ కరెన్సీ విలువను నిర్ణయించడానికి మార్కెట్లో జోక్యం చేసుకోవడం లేదని తెలిపారు. డాలర్ రేటు పెరగడం, డాలర్‌కి అనుకూలంగా మారకం రేటు పెరగడంతో రూపాయి విలువ నిలిచిపోయి వుండవచ్చని అన్నారు.
యుద్ధం నిత్యావసరాల ధరలను పెంచిందనీ, అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో పెరగడానికి దారితీసిందని చెప్పారు.